జనచైతన్య సభకు భారీగా తరలిరావాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు
హనుమకొండ, నవంబర్ 21 (ప్రజాజ్యోతి):
ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు హనుమకొండ పట్టణంలోని కేడీసీ కళాశాల గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనచైతన్య సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సభకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15, 16, 17వ డివిజన్లతో పాటు పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జనచైతన్య సభను విజయవంతం చేయాలని కోరారు.
