యాచారం–మంచిప్ప రోడ్డుపై పులి కలకలం

Rammoorthy Kamareddy
1 Min Read

యాచారం–మంచిప్ప రోడ్డుపై పులి కలకలం

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.. అటవీశాఖ చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి

గాంధారి , నవంబర్ 21(ప్రజాజ్యోతి )

సదాశివనగర్‌ మండలంలోని యాచారం–మంచిప్ప ప్రధాన రహదారిపై పులి సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల ఈ రహదారిపై పులి కనిపించడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో నీటి కోసం వన్యప్రాణులు అడవిని విడిచి బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.పులి సంచార నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రాకపోకలు సాగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పులి కదలికలను అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *