విద్యుత్ వైర్లతో గడ్డి కట్టలు దగ్ధం

Rammoorthy Kamareddy
1 Min Read

విద్యుత్ వైర్లతో గడ్డి కట్టలు దగ్ధం

రూ.50 వేల ఆస్తి నష్టం.. అధికారుల నిర్లక్ష్యంపై రైతు ఆవేదన

గాంధారి నవంబర్ 21(ప్రజాజ్యోతి)

గాంధారి మండలంలోని మతు సంగం గ్రామంలో విద్యుత్ వైర్లు తగలడంతో గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రైతు చిన్నోళ్ల సాయిలుకు సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.గ్రామంలోని వ్యవసాయ విద్యుత్ లైన్లు 11 కేవీ, ఎల్‌టీ లైన్లు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని, వాటి మధ్యలో అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వాపోయారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వ్యవసాయ విద్యుత్ లైన్లలో వేలాడుతున్న వైర్లను సరిచేయడంతో పాటు అవసరమైన చోట అదనపు స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా, ప్రాణనష్టం సంభవించక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *