గ్రామీణుల సంక్షేమమే లక్ష్యంగా ‘ఎన్నారై వాసవి అసోసియేషన్’ చేస్తున్న సేవలు అభినందనీయం
* రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి
* గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యమే సంస్థ లక్ష్యం
* ఎన్నారై వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- పాఠశాలకు కంప్యూటర్, వాటర్ ప్యూరిఫైయర్ అందజేత
దామెర/కోగిల్వాయి, మార్చి 12 (ప్రజాజ్యోతి):
గ్రామీణుల సంక్షేమమే లక్ష్యంగా ‘ఎన్నారై వాసవి అసోసియేషన్’ చేస్తున్న సేవలు అభినందనీయమని రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఎన్నారై వాసవి అసోసియేషన్ డైరెక్టర్ దివాకర్ జంధ్యం సౌజన్యంతో హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో ప్రాధామిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యమే సంస్థ లక్ష్యమని ఎన్నారై వాసవి అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు.
ఈ ఆరోగ్య శిబిరంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులచే గుండె, ఛెస్ట్, దంత, ఆర్థోపెడిక్, కంటి సంబంధిత పరీక్షలతో పాటు బీపీ, షుగర్ మరియు రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఒక లక్ష రూపాయల విలువ గల ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల డిజిటల్ విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠశాలకు ఒక కంప్యూటర్‌ను అందజేశారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. అలాగే విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా వాటర్ ప్యూరిఫైయర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ సభ్యులు పవన్ రవ్వ మరియు శ్రీమతి దొడ్డ ప్రేమలత గారు ఆర్ఓ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ దానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ దివాకర్ జంధ్యం గారి సౌజన్యంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్ రెండు లక్షల విలువ గల వస్తువులు అందజేయడంతో పాటు విద్యార్థుల సౌకర్యార్థం వెస్ట్రన్ టాయిలెట్ నిర్మించి ప్రారంభించారు.
ఈ శిబిరంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనలు పొందారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా ఎన్నారై వాసవి అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ.. కోగిల్వాయి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరంలో 642 మందికి పైగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అని వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి మరియు విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలనే లక్ష్యంతో ఎన్నారై వాసవి అసోసియేషన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని గ్రామ పెద్దలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామాల్లో మరింతగా నిర్వహించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనిత మహేందర్, ఉప సర్పంచ్ ప్రశాంత్, జంగిలి నాగరాజు, రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, ఎన్నారై వాసవి అసోసియేషన్ అధ్యక్షుడు బాపనపల్లి రమేష్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ తడకమల్ల ప్రవీణ్, సెక్రటరీ మహేష్ జెమిల్లా, జంధ్యం మధుకర్, జంధ్యం కరుణాకర్, సీనియర్ ఫిజీషియన్ డా. బండెల మోహన్ రావు, డా. కే . మల్లేశం, ఐఏంఏ వరంగల్ జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ, టిఎస్ఏంసి మెంబర్ డా. వి. నరేష్, పిల్లల వైద్యులు డా. అశోక్ రెడ్డి, డా. శేషు మాధవ్, డా. అశ్విని, ఈఎన్టి వైద్యులు డా. సుదీప్, డా. నిఖిల్ కుమార్, కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ వైద్యులు డా. ఆనంద్, డా. సకారం, డెంటల్ వైద్యులు డా. వికాస్, డా. స్నిగ్ధ, స్త్రీ వైద్య నిపుణులు డా. సిరి, డా. శివ భార్గవి, డా. ఎస్కే సమరిన్, మెడికల్ ఆఫీసర్ డా. రధ శృతి ప్రియ, రెడ్ క్రాస్ వైద్యులు డా. జె. కిషన్ రావు, డా. మొహమ్మద్ తయార్ మసూద్ పాల్గొన్నారు.
అలాగే రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్, గంగాధర్, ఉపేందర్, జగదీశ్వర్, కల్పన, రమేష్, పోషాలు తదితరులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

