శ్రీశైలంలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం

V. Sai Krishna Reddy
1 Min Read

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. యాత్రికులు బస చేసిన ఓ వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన భక్తులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనతో అక్కడున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలంలోని ఓ వీఐపీ కాటేజీ గదిలో ఉన్న ఎయిర్ కండిషనర్ (ఏసీ)లో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఏసీ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో గదిలో ఉన్న భక్తులు మంటలను గమనించి, భయంతో కేకలు వేస్తూ గది నుంచి బయటకు పరుగులు తీశారు. వారి అరుపులతో కాటేజీలోని ఇతర గదుల్లో ఉన్న వారు కూడా అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై శ్రీశైలం దేవస్థానం అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *