విద్యార్థుల్లో దేశభక్తి జ్వాలలు రగిలించిన మనం యువసేన గరిడేపల్లి,జనవరి 26(ప్రజా జ్యోతి):

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సీత్లతండ గ్రామంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశభక్తి,ప్రేరణాత్మక కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేందర్ నాయక్ ఆదేశాల మేరకు యువసేన టీం సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క మహత్తు,గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత,దేశభక్తి విలువలపై సవివరంగా అవగాహన కల్పించారు.విద్యతో పాటు క్రమశిక్షణ,నైతిక విలువలు, దృఢమైన సంకల్పం ఉంటేనే జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు.దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని,సమాజా నికి సేవ చేయాలనే తపన విద్యార్థులలో ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి,దేశంపై ప్రేమను మరింత బలపరిచిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మనం యువసేన ఫౌండేషన్ సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *