పర్యావరణ పరిరక్షణపై శిక్షణ పొందుతున్న 24 దేశాల విదేశీ ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్‌ను సందర్శించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 24 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.
సాగర్ జలాశయం, జలవిద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. జలవనరుల శాఖ అధికారులు వారికి సాగర్ ప్రాజెక్టు చరిత్రను వివరించారు. కాగా, నాగార్జునసాగర్‌కు ఇటీవల విదేశీ సందర్శకుల తాకిడి పెరిగింది. రెండు రోజుల క్రితమే శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు సాగర్‌ను సందర్శించారు.