పిసిసి డిసైప్లినరి కమిటీ సభ్యులుగా రామకృష్ణ
నిజామాబాద్, ప్రజాజ్యోతి :
నూతనంగా ఏర్పడిన పిసిసి డిసిప్లీనరీ కమిటి సభ్యులుగా నిజామాబాద్ కు చెందిన జీవి. రామకృష్ణ ఎన్నికయ్యారు. రామకృష్ణ న్యాయవాది గా పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రస్థానం 1990 లో ఎన్ఎస్యుఐ డిస్టిక్ ఆర్గనైజర్ సెక్రెటరీగా, నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గా,I స్టేట్ జెనరల్ జనరల్ సెక్రటరీగా చేశారు. 2015లో పిసిసి సెక్రటరీగా అలాగే జోన్ కాంగ్రెస్ క్యాడర్ ట్రైనింగ్ కమిటీ మెంబర్ గా, పిసిసి ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ మెంబర్ గా, స్ట్రాటజీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా సేవలు అందించారు. ఇప్పుడు పొలిటికల్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ పిసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.