దామెర, మార్చి 4 (ప్రజాజ్యోతి):
విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని దామెర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి విద్యార్థులకు సూచించాడు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లకు గురికాకుండా పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో రాయాలని సూచించారు. కళాశాల యాజమాన్యం మరియు తల్లిదండ్రులు ర్యాంకుల కోసం చేసే ఒత్తిడిలో విద్యార్థులు బలి కావద్దని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్షలను ర్యాంకుల కోసం కాకుండా తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సొంత ఆలోచనతో పరీక్షలు రాయాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి తీసుకోమనే నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించేస్తూ ఐదు నిమిషాల సమయం గ్రేస్ టైం ఇవ్వటం పట్ల విద్యార్థుల్లో ఎంతో ఆనందం వెల్లు వెత్తినదన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాసి మంచి ఉత్తమమైన ఫలితాలను సాధించాలని ఆయన కోరారు.