పరకాల, మార్చి 12 (ప్రజాజ్యోతి):
ఆటో బోల్తా.. మహిళా కూలీలకు తీవ్ర గాయాలు..
హనుమకొండ జిల్లా నడికూడ మండల శివారులో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది మహిళా కూలీలకు గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 30 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. బాధితులంతా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందినవారు.