ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ నివాసంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు .. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే

Vikarabad Staff Reporter
1 Min Read

 

ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ నివాసంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఉమా రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పూల పండుగ వేడుకలు.. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నఎమ్మెల్యే

పరిగి, అక్టోబర్ 18 (ప్రజాజ్యోతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఉమా రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఎమ్మెల్యే నివాసంలో పండుగ సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, మహిళలు, యువతులు, చిన్నారులు, పెద్దలు పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *