కళ్ల ముందే కనిపిస్తున్నా.. పట్టించుకునే వారేరీ?

Warangal Bureau
1 Min Read
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 90; algolist: 0; multi-frame: 1; brp_mask:28; brp_del_th:0.0546,0.0000; brp_del_sen:0.1300,0.0000; motionR: 0; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 175.56122;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 40;

కళ్ల ముందే కనిపిస్తున్నా.. పట్టించుకునే వారేరీ?

మండల పరిషత్ కార్యాలయంలో నిర్లక్ష్యపు ఛాయలు!

వృథాగా పోతున్న నీటితో శిథిలావస్థకు చేరుతున్న భవనం

భయం భయంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు!

ఆత్మకూరు, అక్టోబర్ 15 (ప్రజాజ్యోతి):

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాధనం, సహజ వనరుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు.. కళ్ల ముందే సమస్యలు కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో బోరు నీరు వృథాగా పోతుండటంతో పాటు భవనం దెబ్బతింటున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలోని వాటర్ ట్యాంక్ నిండిపోయి నీరు వృథాగా బయటకు ప్రవహిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఓవర్‌ఫ్లో పైపు ఊడిపోవడంతో నీరు నిరంతరం వృథాగా పోతున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా భవనం గోడలపై నుంచి నీరు కారుతూ భవనానికి మరింత నష్టం వాటిల్లి, ప్రమాద స్థాయికి చేరుకునే పరిస్థితి నెలకొంది.

శిథిలావస్థకు చేరుతున్న భవనం!

మరోవైపు కార్యాలయ భవనం పెచ్చులూడుతూ శిథిలావస్థకు చేరుతుంది. భవనం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన మధ్య ఉద్యోగులు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు.

అధికారులు స్పందించేదెప్పుడు?

ప్రభుత్వ కార్యాలయంలోనే నీటి వృథా, భవనం నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి వృథాను అరికట్టడంతో పాటు దెబ్బతిన్న భవనానికి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో సమస్యను పరిష్కరించి, భవనాన్ని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఉద్యోగులు, స్థానికులు కోరుతున్నారు.

 
 
 
 
 
 
 

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *