వైఎన్ పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 20(ప్రజా జ్యోతి):సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 30వ వార్డు హైటెక్ కాలనీ ఇందిరా నగర్ లో వైఎన్ పీఎస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ ఉత్సవాలలో భాగంగా

శనివారం రాత్రి దాసరి పవన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.గణనాధుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.తమ యూత్ ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో పల్సా మల్సూర్ గౌడ్, పాలకుర్తి వెంకట్ గౌడ్, ముక్కిడి యాదగిరి, శ్రీధర్, సోమా ప్రవీణ్, జితేందర్, రాచూరి నవీన్,దాసరి నవీన్, సైదులు, సాయి, రాచూరి నాగేందర్, అంజన్,ముక్కిడి బాలు గౌడ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *