మహాగణపతికి ప్రత్యేక హోమం.. ఘనంగా అన్నప్రసాదం..
పరకాల సెప్టెంబర్ 20 ప్రజాజ్యోతి
పరకాల మండలంలోని అలియాబాద్ గ్రామంలో బొడ్రాయి యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహాగణపతికి ప్రత్యేక హోమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం భక్తులు, గ్రామస్థులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాన్ని బొడ్రాయి యూత్ సభ్యులు, గ్రామస్థులు విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం సర్పంచ్ శతరాశి సనత్ పటేల్ వార్డు మెంబెర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు.
