వార్డుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్న కౌన్సిలర్లు 

Vikarabad Staff Reporter
1 Min Read

వార్డుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్న కౌన్సిలర్లు 

 

టీచర్స్ కాలనీలో రోడ్డు మరమ్మతులు – ఖాన్ కాలనీ లో బోరు మోటార్ ఏర్పాటు, నీటి సరఫరా పునరుద్ధరణ

 

పరిగి, ఆగస్టు 17 (ప్రజాజ్యోతి):

పరిగి మున్సిపల్ పరిధిలోని 12వ, 13వ వార్డుల సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లు వారాల రవీందర్, మీర్ సమీనా తాహేర్ అలీ నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో 12వ వార్డులోని టీచర్స్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడటంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గుర్తించిన 12వ వార్డు కౌన్సిలర్ వారాల రవీందర్ చొరవ తీసుకుని మట్టి వేయించి రోడ్లను చదును చేయించి మరమ్మతు పనులు చేపట్టించారు. అలాగే మీర్ సమీనా తాహేర్ అలీ గత కొద్ది రోజులుగా 13 వ వార్డు లోని ఖాన్ కాలనిలోని బోరు మోటార్ పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది సహకారంతో కొత్త మోటార్‌ను ఏర్పాటు చేయించి నీటి సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు.

వార్డులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కౌన్సిలర్లుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *