- తునికి గ్రామ ఫారెస్ట్ భూమిలో గుర్తుతెలియని మృతదేహం
- హత్య చేసి తగలబెట్టారా..? అనే అనుమానం..!
నర్సాపూర్/ కౌడిపల్లి (ప్రజాజ్యోతి) మండల పరిధిలోని తునికి గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గురువారం మధ్యాహ్న సమయంలో గ్రామ శివారులోని సర్వే నంబర్ 316కు చెందిన అటవీ భూమిలో ఈ ఘటన వెలుగుచూసింది.
Contents
దుర్వాసన రావడంతో వెలుగులోకి:– మెదక్ – నర్సాపూర్ ప్రధాన రహదారి నుంచి తునికి వ్యవసాయ పొలాలకు వెళ్లే మట్టి దారి పక్కన ఉన్న చెట్టు కింద మానవ అస్థిపంజరం పడి ఉండటాన్ని గమనించారు. ఆ ప్రాంతం నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల పరిశీలించగా, అస్థిపంజరం వెలుగుచూసింది. అస్థిపంజరానికి సుమారు 15 మీటర్ల దూరంలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.హత్యగా అనుమానం:– ఘటనా స్థలానికి 10 మీటర్ల దూరంలో వెంట్రుకలు, అస్థిపంజరం పక్కన మరికొన్ని ఎముకలు అక్కడక్కడ పడి ఉన్నాయి. మృతదేహాన్ని కాల్చిన చోట ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు చీర ముక్కలు లభ్యమయ్యాయి. వీటిని బట్టి మృతురాలు మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మహిళను ఎక్కడో హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా ఇక్కడకు తీసుకువచ్చి తగలబెట్టినట్లు ఆనవాళ్లు తెలుపుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
