తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతికి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం 2650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 2,58,895 మంది అబ్బాయిలు, 2,50,508 మంది అమ్మాయిలు. రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. శుక్రవారం నుంచి ప్రారంభ మయ్యే పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే, కాంపోజిట్ కోర్సు లో ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు జరగనుండగా.. సైన్స్ సబ్జెక్టులకు ఫిజికల్, బయోలజీ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు రెండు రోజులు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతికి పరీక్షల కోసం 2650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 2,58,895 మంది అబ్బాయిలు, 2,50,508 మంది అమ్మాయిలు ఉన్నారు. పదో పరీక్షల నిర్వహణలో భాగంగా 2,650 మంది సీఎస్ లు, డీవోలను, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇప్పటికే పాఠశాలల ద్వారా విద్యార్థులకు హాల్ టికెట్ల జారీ చేసిన ఎగ్జామినేషన్ విభాగం.. అందని స్టూడెంట్స్ నేరుగా వారి హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది.