అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడా తగ్గడంలేదు. భారీగానే అంకెలతో బడ్జెట్ ని రూపొందిస్తున్నాయి. దీని వల్ల ఏమిటి మేలు అని విపక్షాలు అంటున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్లు చూస్తే జిగేల్ మంటాయి. భారీ అంకెలతో కనిపిస్తాయి. ఏ ఏటికి ఆ ఏడు వేల కోట్లు పెంచుకుంటూ పోతున్నాయి. అయితే ఇంత పెద్ద బడ్జెట్లు చూసిన తరువాత ఎవరైనా అనుకునేది ఒక్కటే మాట. రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ తెలంగాణా అత్యంత సంపన్న రాష్ట్రాలు అని. కానీ అదే టైంలో ఖజానా ఖాళీ అని రెవిన్యూ లోటు ఉందని వచ్చిన ఆదాయం చూస్తే ఎక్కడా సరిపోవడం లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతారు.
తాజాగా తెలంగాణా ఆర్థిక పరిస్థితి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను పట్టుకుని నేషనల్ మీడియా హైలెట్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఆ రాష్ట్రం ఉంది అన్నట్లుగా కధనాలు వచ్చాయని ప్రచారంలో ఉంది. ఇపుడు చూస్తే బడ్జెట్ ఘనంగానే పెట్టారు. బుధవారం తెలంగాణా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హోదాలో మల్లు భట్టి విక్రమార్క ఏకంగా మూడు లక్షల నాలుగు వేల కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు
ఈ బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులు కూడా భారీగానే ఉన్నాయి. ఈ బడ్జెట్ లో అనేక ప్రాధాన్యతలను కూడా ముందుకు తెచ్చారు. విద్య వైద్యం సాగు నీటి పారుదల రంగం వ్యవసాయానికి బడ్జెట్ లో అధిక మొత్తంలో నిధులను కేటాయించారు. ఇది అందరి బడ్జెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇక దీనికి కొద్ది రోజుల ముందు ఏపీ ప్రభుత్వం కూడా భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. 3,22,359 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ని రూపొందించారు. ఈ బడ్జెట్ లో లక్ష కోట్ల లోటు ని కూడా చూపించారు. దీని మీదనే విపక్షాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారని విమర్శలు చేశాయి. ఇక చూస్తే ఏపీ ప్రభుత్వం ప్రతీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద అప్పులను తెస్తోందని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి
తాజాగా తెలంగాణా ఆర్థిక పరిస్థితి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను పట్టుకుని నేషనల్ మీడియా హైలెట్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఆ రాష్ట్రం ఉంది అన్నట్లుగా కధనాలు వచ్చాయని ప్రచారంలో ఉంది. ఇపుడు చూస్తే బడ్జెట్ ఘనంగానే పెట్టారు. బుధవారం తెలంగాణా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హోదాలో మల్లు భట్టి విక్రమార్క ఏకంగా మూడు లక్షల నాలుగు వేల కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. Also Read – ముందు జగన్….వెనక పవన్ ! ఈ బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులు కూడా భారీగానే ఉన్నాయి. ఈ బడ్జెట్ లో అనేక ప్రాధాన్యతలను కూడా ముందుకు తెచ్చారు. విద్య వైద్యం సాగు నీటి పారుదల రంగం వ్యవసాయానికి బడ్జెట్ లో అధిక మొత్తంలో నిధులను కేటాయించారు. ఇది అందరి బడ్జెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇక దీనికి కొద్ది రోజుల ముందు ఏపీ ప్రభుత్వం కూడా భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. 3,22,359 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ని రూపొందించారు. ఈ బడ్జెట్ లో లక్ష కోట్ల లోటు ని కూడా చూపించారు. దీని మీదనే విపక్షాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారని విమర్శలు చేశాయి. ఇక చూస్తే ఏపీ ప్రభుత్వం ప్రతీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద అప్పులను తెస్తోందని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. Also Read – పొలిటికల్ సినీ స్టార్స్.. తెలంగాణలో కొత్త ట్రెండ్ ఏపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే పది లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని అర్ధం అవుతోంది. ఇక తెలంగాణా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడ కూడా ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. బడ్జెట్ లో ఆశించిన ఆదాయాలు రాకపోయినా లేక వేసుకున్న అంచనాలు తగ్గినా అప్పులు చేయాల్సిందే అని అంటున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడా తగ్గడంలేదు. భారీగానే అంకెలతో బడ్జెట్ ని రూపొందిస్తున్నాయి. దీని వల్ల ఏమిటి మేలు అని విపక్షాలు అంటున్నాయి. వాస్తవికతకు అద్దం పట్టేలా బడ్జెట్ ని రూపొందించాలని కోరుతున్నాయి. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది. అప్పులు ఎన్ని ఉన్నాయి. నికరంగా కేంద్రం ఇచ్చే సాయం ఏమిటి ఆర్థిక వనరులు ఏమిటి అన్నీ చూసుకుని బడ్జెట్ ని జనాల ముందు పెడితే ఏ విధమైన అపోహలూ ఉండవు కదా అని విపక్షాలు అంటున్నాయి.