ఏపీ అసెంబ్లీలో నేడు ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రోటోకాల్ పట్ల చంద్రబాబు ఎంత నిబద్ధతతో ఉంటారో నిరూపితమైంది.
అసలు ఏం జరిగిందంటే… ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు… అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి కంటే అత్యున్నత స్థాయిలో ఉంటారు… కాబట్టి నేనే స్వయంగా స్పీకర్ ఛాంబర్ కు వెళ్లి కలుస్తాను అని అధికారులకు బదులిచ్చారు.
అనడమే కాదు… స్వయంగా వెళ్లి స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిసి ఆయన హోదాకు తగిన గౌరవం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యన్నపాత్రుడు ఆశ్చర్యపోయారు