ఏపీ మంత్రి నారా లోకేశ్ దుబాయ్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు హాజరవడంపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుందని అన్నారు. గ్రూప్-2 పరీక్షను గంగలో కలిపేసి కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన నారా లోకేశ్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తూ జాలీగా గడుపుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు పుత్రరత్నం, విద్యాశాఖ మంత్రి నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు నిరుద్యోగులు ఏమైతే నాకేంటి అన్నట్టు ఆటవిడుపులో ఉన్నారని శ్యామల వ్యాఖ్యానించారు.
ఏపీలో విద్యార్థులు, నిరుద్యోగులు అల్లాడుతుంటే దుబాయ్ లో దుబారా తిరుగుళ్లు తిరగడం మీకే సరిపోయింది లోకేశ్ గారు. నవ్వాలో, ఏడ్వాలో అర్థంకాని దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి” అంటూ శ్యామల ధ్వజమెత్తారు.