దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. వరుసగా 8 సెషన్లుగా నష్టాలను చవిచూసిన మార్కెట్లు… ఈరోజు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు… చివర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి అడుగుపెట్టాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో 75,996 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 22,959 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో మన రూపాయి మారకం విలువ రూ. 86.87గా ఉంది.