BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పులతడకగా ఉందని BRS MLC కవిత ఆరోపించారు. ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ‘బీసీలకు 42శాతం కాదు, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాలి. మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టడమే బీజేపీ నేతల పని. జై భీమ్, జై బీసీ నినాదం ఒకచోటే ఉండాలి’ అని డిమాండ్ చేశారు.