టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. కటక్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాట్స్ మెన్ రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
36 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. జో రూట్ 47, కెప్టెన్ జోస్ బట్లర్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ బెన్ డకెట్ అర్ధసెంచరీ నమోదు చేశాడు. ధాటిగా ఆడిన డకెట్ 56 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేశాడు.
మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 26, హ్యారీ బ్రూక్ 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 1, రవీంద్ర జడేజా 1, హర్షిత్ రాణా 1 వికెట్ తీశారు.