దేవగిరిపట్నం మైనారిటీ బాలికల గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ 

Warangal Bureau
1 Min Read

దేవగిరిపట్నం మైనారిటీ బాలికల గురుకులంలో అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ

ములుగు / ప్రజాజ్యోతి::

ములుగు జిల్లా ములుగు మండలంలోని దేవగిరి పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో అడ్మిషన్ల కొరకు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ప్రిన్సిపాల్ శ్రీలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల ఐదవ తరగతిలో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఐదవ తరగతిలో 80 సీట్లకు గాను 51 సీట్లు ముస్లిం మైనారిటీలకు ఐదు సీట్లు క్రిస్టియన్ మైనారిటీలకు ఒక సీటు జైనులకు ఒక సీటు సిక్కులకు ఒక సీటు బౌద్దులకు ఒక సీటు పార్శీలకు అలాగే బీసీలకు 10 సీట్లు ఎస్సీలకు ఐదు సీట్లు ఎస్టీలకు మూడు సీట్లు ఓసీలకు రెండు సీట్లు ఉంటాయన్నారు. అలాగే6,7 ,8 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీలకు ముస్లిం మైనారిటీలు మాత్రమే అర్హులన్నారు. తల్లిదండ్రులు http://tgmreis Telangana.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 93980 19134, 73961 94275, 97019 07575 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎండి మక్బూల్ పాషా, ఎండి సర్వర్ అహ్మద్, ఎండి హజీ పాషా, ఎస్.కె ముజామిల్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *