- మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం..
- రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
- ప్రత్యేక నిధులతో వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేపిస్తా..
- ఇందిరమ్మ చీరలను మరియు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ సత్య శారద
వర్ధన్నపేట, ప్రజా జ్యోతి::
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు స్పష్టం చేస్తూ సోమవారం వర్ధన్నపేట పట్టణంలోని ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెస్మా ) ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, కే.ఆర్. నాగరాజు మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి హాజరై, మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు 122 సంఘాలకు 28 లక్షల 84వేల 141 రూపాయల విలువ గల వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళ సంఘాలకు పంపిణీ చేశారు.
తొలుత మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సత్య శారద దేవి కి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం ద్వారా వారు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా బలపడతారని పేర్కొన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించే లక్ష్యంతో రూపుదిద్దుకుందని తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు రావాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు.ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నాగరాజు గారు స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మహిళల అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు తన వంతుగా అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రి, 200 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సబ్ జైలు, మున్సిఫ్ కోర్టు, ఆర్డీవో కార్యాలయం మరియు టౌన్ అభివృద్ధికి 15 కోట్ల మరియు నుంచి 5 కోట్ల రూపాయలు నిధులతో. అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి అంతా మరింతగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పేర్కొన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు, అసత్య మాటలను నమ్మి తప్పుదారి పట్టితే భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ముఖ్యమంత్రి గారికి అది గొప్ప బహుమతిగా నిలుస్తుందని, తద్వారా వర్ధన్నపేటకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.వర్ధన్నపేట అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు నిరంతరం అందిస్తానని హామీ ఇస్తూ, మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలను నాయకులకు, మహిళా సంఘాలను కోరిన ఎమ్మెల్యే నాగరాజు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్, వహీదా, టౌన్ స్వయం సహాయక సంఘాల అధ్యక్షురాలు అర్రేల్లి లక్ష్మీ, సర్పంచ్లు చిటూరి రాజు, పఠాన్ రజాక్, బ్యాంక్ ప్రతినిధులు మరియు టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తుల్లా రవి, పట్టణ నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, అఫ్సర్, కొండేటి బాలకృష్ణ, సుధీర్ తో పాటు మహిళా సంఘాల సభ్యులు, పట్టణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

