మామడ డిసెంబర్ 28 (ప్రజా జ్యోతి) :
హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం పొన్కల్ లో శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు.
ఇందుకు గ్రామంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.స్వామివారిని పూల మాలలతో, కాషాయ జెండాలతో అలంకరించి స్వామివారికి ఘనంగా మంగళ హారతులలో స్వాగతం పలుకుతూ మహిళలు గ్రామంలో గల శివాలయం పక్కన ఉన్న హనుమాన్ మందిరంలో పూజలు చేశాక, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమయ్యే శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర గ్రామంలో గల ప్రధాన వీధుల గుండా సాగి అంగడి బజార్లో ముగుస్తుందని నిర్వాకులు గురు స్వామి గంగన్న తెలిపారు. హిందువులందరూ యాత్రలో పాల్గొనాలని కోరారు. భక్తి భావంతో ర్యాలీ నిర్వహించాలని సూచించారు.
నేడే వీర హనుమాన్ శోభాయాత్ర
Leave a Comment
