ఐకమత్యం సాటేందుకే ఏక్తాదివాస్

V. Sai Krishna Reddy
1 Min Read

ఐకమత్యం సాటేందుకే ఏక్తాదివాస్

2కె రన్ ప్రారంభించిన డిఎస్పీ

మిర్యాలగూడ, అక్టోబర్ 31,( ప్రజాజ్యోతి ): ప్రజల్లో ఐకమత్యాన్ని చాటేందుకు ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మిర్యాలగూడ డిఎస్పి కె రాజశేఖర్ రాజు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పలుచోట్ల 2కె రన్ నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన2కె రన్ ను డిఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో అవంతిపురం లో, వాడపల్లి పోలీసుల ఆధ్వర్యంలో దామరచర్ల మండల కేంద్రంలో 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువత, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో సిఐలు పి ఎన్ డి ప్రసాద్, సోమ నరసయ్య, నాగభూషణరావు, ఎస్సైలు రాంబాబు, లక్ష్మయ్య, సైదిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *