- చింతనెక్కొండ లో వీధి కుక్కల దాడి
- కుక్కకాటుకు గురైన గ్రామస్తుడు డబ్బెట కొమ్మాలు
పర్వతగిరి, అక్టోబర్ 09 (ప్రజాజ్యోతి):
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన డబ్బెట కొమ్మాలు తండ్రి వీరయ్య ఇంటి నుండి వ్యవసాయ భూమి పొలానికి నీళ్ళు పెట్టేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో వీది కుక్కలు గుంపుగా చుట్టూ ముట్టి అందులో ఒక కుక్క కాలును బలంగా నాటుతే అందుకొని పీకింది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కరల సాయంతో కుక్కలన్నీటిని చల్లా చదరం చేసి వాటిని దూరంగా వెళ్లగొట్టి రక్తస్రావం అవుతున్న కొమ్మాలను పక్కన కూర్చోబెట్టి తాత్కాలికంగా కాలుకి కట్టు కట్టి మెరుగైన వైద్యం కోసం పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 200కు పైగా కుక్కలు గ్రామంలో ఉన్నాయి. రోజు వీధి వీధినా గల్లి గల్లిన కుక్కలు గుంపులుగా తిరుగుతూ గ్రామస్తులను పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను రైతులను కూలీలను భయభ్రాంతులకు గురి చేస్తూ కరుస్తున్నాయని ఆరోపించారు. నెక్కొండ వరంగల్ ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా వాహనాలు వెళుతూ ఉంటాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నా వారిని వీరి కుక్కలు వెంబడించడంతో కింద పడి కాళ్ళు చేతులు విరిగిన రోజులు ఉన్నాయని ఇదే విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యదర్శి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో వీధి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని వేడుకున్నారు.

