కాలేశ్వరం ప్రాజెక్ట్ పై ఫేక్ రిపోర్ట్…!

Kamareddy
1 Min Read

కాలేశ్వరం పై ఫేక్ రిపోర్ట్…!

సంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ 

కాలేశ్వరం ప్రాజెక్ట్ అచ్చా హై..!

బిఆర్ఎస్ నాయకుల భారీ ధర్నా

రామారెడ్డి సెప్టెంబర్ 2 (ప్రజా జ్యోతి)

రామారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ పిలుపుమేరకు స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆదేశాల మేరకు మంగళవారం రామారెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ అచ్చ హై అంటూ నినాదాల తో కాలేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం మానుకుని నిజాలు ఒప్పుకోవాలి. అని అధికార పార్టీ కాంగ్రస్ పై డిమాండ్ చేశారు. విష ప్రచారం మానుకుని ప్రజాక్షేత్రంలో ప్రజల వివరణ తెలుసుకొని పాలన కొనసాగించండి. జస్టిస్ గోష్ రిపోర్టు తప్పుల తడకగా ఉంది అని? నిజానికి కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయిని, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని,అన్నారు. అకాల వర్షాలకు రాష్ట్రంలో భారీ నష్టం జరిగినా కూడా ప్రజల పై పట్టింపు లేకుండా అసెంబ్లీ మీటింగులు పెట్టడం ఎంతవరకు సమంజసం, ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించక, నాడు రైతులకు విత్తనలు కొరత లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేసింది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే యూరియా ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన అసమర్ధ ప్రభుత్వం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, సీనియర్ బిఆర్ఎస్ కార్యకర్తలు,బనూరి నర్సారెడ్డి, లేగల మహిపాల్,పడిగల శ్రీనివాస్, కడెం బైరయ్య,కడెం శ్రీకాంత్, రాజనర్సు, హనుమల రాజయ్య, గొల్లపల్లి సీనియర్ నాయకుడు పాల మల్లేష్ ,పోతునురి ప్రసాద్,మాజీ బిఆర్ఎస్ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, మాజీ రైతుబంధు అధ్యక్షుడు నారాయణరెడ్డి, కాసర్త రాజేందర్, బిఆర్ఎస్ మండల సెక్రెటరీ బుచ్చిరెడ్డి, రెడ్డి మల్లేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *