మిర్యాలగూడ ప్రకాష్ నగర్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్
సరైన పత్రాలు లేని 98 బైకులు, 16 ఆటోలు, 3కార్లు, ట్రాక్టర్ స్వాదీనం
8మంది గంజాయి సేవించినట్లు గుర్తింపు, లోతుగా విచారణ
పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర
మిర్యాలగూడ, మే 29,( ప్రజా జ్యోతి ):నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు.డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో 280 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రకాష్ నగర్ లో జల్లెడ పట్టారు.తొలుత కాలనీని అష్టదిగ్భంధనం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కాలనీవాసులు,అద్దెకు ఉంటున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను పరిశీలించారు. వాహనాల పత్రాలను క్షుణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 98 బైకులు,16 ఆటోలు, మూడు కార్లు,ఒక టాక్టర్, 220 మద్యం బాటీళ్ల ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పరిశీలించి వివరాలు వెల్లడించారు.అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు చెప్పారు.యువత గంజాయి, మద్యం,గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.తమ వద్ద ఉన్న ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారాఅనుమానితులను,పాత నేరస్తులను గుర్తించామనితెలిపారు.మొత్తం 50 మందిని గాంజా టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించినట్టు టెస్టులో రిపోర్ట్స్ రావడం జరిగిందని, వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి సేవించారనే దానిపైన విచారణజరుపుతున్నామనిఅన్నారు.కాలనీల్లో,ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.
