స్వయం సహాయక సంఘాలు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించాలి

Kamareddy
1 Min Read

ఏపీడి విజయలక్ష్మి
గాంధారి ఆగష్టు 22 (ప్రజాజ్యోతి)

గాంధారి మండలంలో శుక్రవారం నిర్వహించిన మండల సమైక్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ..స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. బ్యాంకు లింక్ టార్గెట్‌ను ఈ ఆర్థిక
సంవత్సరంలోనే పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.గ్రామ స్థాయిలో వృద్ధ సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిశోర్ బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని సీసీలకు సూచించారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన లక్ష్యాలను సమయానికి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అలాగే మహిళా సంఘాలు ప్రతి నెల సమావేశాలు నిర్వహించి తమ ప్రగతినిసమీక్షించుకోవాలని, చిన్న తరహా వ్యాపారాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మహిళలను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌వి‌వి‌పి ఏపీఎం రాజేందర్, డిపిఎం సురేష్, ఏపీఎం ప్రసన్న కుమార్, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నరు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *