జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ
ఎస్సై అరుణ్ కుమార్
ప్రజా జ్యోతి జుక్కల్ ప్రతినిది జులై 05
పెద్ద కొడప్గల్ మండలంలోని అంజనీ గేట్ జాతీయ రహదారి 161 పై శనివారం ఎస్సై అరుణ్ కుమార్ వాహనాలు తనిఖీ చేశారు.ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ…. ట్రాఫిక్ నిబంధన ఉల్లంగించి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై వాహనాల సంఖ్య పెరుగుతుందని, రద్దిగా ఉండే ప్రదేశాలలో, మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలు నడపడంవలన,ప్రమాదాలు,మరణాలుసంభవిస్తున్నాయని అన్నారు.రోడ్డు పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనాలుసీజ్ చేయడం జరుగుతుందన్నారు. వాహనాలు నడిపే వహన దారులు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని అన్నారు.వాహనం నడపడం,సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.