డిస్కౌంట్లకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకువచ్చిన అమెజాన్

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త రుసుము వసూళ్లను ప్రారంభించింది. వినియోగదారులు డిస్కౌంట్లపై ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు, దానిపై రూ.49 చొప్పున ప్రాసెసింగ్ ఫీజును విధిస్తోంది. అయితే, తక్షణ డిస్కౌంట్ రూ.500లు దాటినప్పుడు మాత్రమే ఈ మొత్తం వసూలు చేస్తోంది. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువుల విలువ అంతకంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో ఈ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.

మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇదివరకే ఈ తరహా రుసుమును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెజాన్ కూడా డిస్కౌంట్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. ఉదాహరణకు, మీరు రూ.5 వేల విలువైన వస్తువును కొనుగోలు చేస్తే, మీ బ్యాంకు మీకు రూ.500 తగ్గింపును అందిస్తుంది. సాధారణంగా మీరు రూ.4,500 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు అమెజాన్ డిస్కౌంట్ ప్రాసెసింగ్ రుసుముగా రూ.49 వసూలు చేస్తుంది కాబట్టి, మీరు రూ.4,549 చెల్లించవలసి ఉంటుంది.

బ్యాంకు ఆఫర్ల నిర్వహణ, ప్రాసెసింగ్ ఖర్చును భరించడానికి ఈ రుసుము ఉపయోగపడుతుందని అమెజాన్ తెలిపింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *