సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టులను సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్రంగా ఖండించారు
కపిల్ సిబల్ ఈ ఘటనపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, “జర్నలిస్టులను అరెస్ట్ చేయడం పరిష్కారం కాదు. ఇది ప్రమాదకరమైన ధోరణి. ఈ రకమైన చర్యలు సమాజంలో స్వేచ్ఛను ఖూనీ చేస్తున్నాయి” అని విమర్శించారు. అలాగే “ఇది అంటువ్యాధిలా మారితే, ప్రెస్ ఫ్రీడం ముప్పులో పడుతుంది” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
కపిల్ సిబల్ వ్యాఖ్యలపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ స్పందించారు. అరెస్ట్ అయిన జర్నలిస్టుల్లో ఒకరు మహిళల పరువు నష్టం కలిగించేలా వ్యవహరించారంటూ ఆమె ఆరోపించారు. “ఆమె ఇతర మహిళలను అవమానించడమే తన లక్ష్యంగా చేసుకుంది. నేనూ ఆమె బాధితురాలినే” అంటూ పూనమ్ ట్వీట్ చేశారు
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా, మరికొంత మంది బాధ్యతారహితంగా ప్రవర్తించే జర్నలిస్టులపై చర్యలు తీసుకోవడం సమంజసమేనంటున్నారు. మహిళా జర్నలిస్టుల అరెస్ట్ పై రాజకీయ, సినీ, మీడియా రంగాల్లోని వ్యక్తుల నుంచి మిశ్రమ స్పందనలు కొనసాగనున్నాయి