ఇండియాలో AML కేసులు పెరుగుతున్నాయి. చిన్న వయసులో కూడా దీని బారిన పడుతున్నారు. డయాగ్నస్టిక్ ఫెసిలిటీస్, హాస్పిటల్ లోపం, కీమోథెరపీ ఇన్ఫెక్షన్లు మరణాలు పెంచుతున్నాయి. మానవ శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ రావచ్చు. దాదాపు 200 రకాల క్యాన్సర్లు ఉంటాయట. అయితే మనిషి రక్తం, ఎముక మజ్జను ప్రభావితం చేసే క్యాన్సర్‌ను అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అంటారు. కొన్నాళ్లుగా ఇండియాలో ఈ రకం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బ్లాస్ట్స్ (Blasts) అని పిలిచే అసాధారణ కణాలు వేగంగా పెరిగినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ బ్లాస్ట్స్ అనేవి సాధారణ రక్త కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఒక రకమైన ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్. పదేళ్ల క్రితం, ఇండియాలో AML కేసులు 40 సంవత్సరాల వారికి, మధ్య వయస్కుల్లో ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు చిన్న వయసులో కూడా దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా వ్యాధి ముదిరిన తర్వాతే చాలామంది దీన్ని గుర్తిస్తున్నారు. దీంతో ట్రీట్మెంట్ ఆలస్యం అవుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సాధారణంగా క్యాన్సర్‌కు కీమోథెరపీతో చెక్ పెట్టవచ్చు. అయితే అక్యూట్ మైలోయిడ్ లుకేమియా బాధితులకు కీమోథెరపీ సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మల్టీడ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో మరణాల రేటు పెరుగుతోంది. AML కేసులను గుర్తించే పర్ఫెక్ట్ మెకానిజం ఇండియాలో లేదు. దీంతో వ్యాధిని త్వరగా గుర్తించలేకపోతున్నారు. అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. దీంతో ఇది సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్‌గా మారుతోంది. అలాగే బాధితులను ఎవరు ట్రీట్ చేయాలనే రిఫరల్ సిస్టమ్‌పై కూడా హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌కు అవగాహన ఉండట్లేదు