మారుతి సుజుకి సంస్థ మిడిల్ క్లాస్ ఫ్యామీలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీ చాలా తక్కువ ధరలో ప్రీమియ ఫీచర్లతో కార్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ లిస్ట్‌లో ఉన్న మొట్టమొదటి కారుగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)ని చెప్పవచ్చు. ఈ కారుకి ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఇది బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, బ్రెజా ఎస్యూవీ మధ్యలో ఉండే కారుగా ఉంటుంది. ఈ కారుని జనాలు సైతం అంతే మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి డిజైన్ స్టైలింగ్, సరసమైన ధరలతో ఈ కారు మరింత పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ కారు ఇటీవలె సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇది లాంచ్ అయిన మొదటి 10 నెలల్లోనే లక్ష అమ్మకాలతో సరికొత్త రికార్డుని తిరగరాసింది. ఈ ఫ్రాంక్స్ మారుతి సుుజుకి నుంచి అత్యంత వేగవంతంగా ఈ అమ్మకాలను రాబట్టిన మోడల్‌గా రికార్డు సృష్టించింది. శరవేగంగా లాభాలను తెచ్చిపెడుతున్న ఈ మారుతి సుజుకి కారు ధరను ఆ కంపెనీ స్వల్పంగా పెంచింది.