ఈ సమయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎక్స్ నుంచి వచ్చిన ట్వీట్ సంచలనంగా మరింది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం సంచలనంగా మారింది. దీనిపై అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి రెండు విభిన్నమైన, సంచలన వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎక్స్ నుంచి వచ్చిన ట్వీట్ సంచలనంగా మరింది. అవును… బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రాసుకొచ్చింది.
అయితే.. దీనిపై స్పందించిన టీడీపీ.. “ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏమిటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా?” అని ప్రశ్నించింది. ఇదే సమయంలో… “నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.ఒ నా? ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ..” అని పోస్ట్ చేసింది