రూ.1040.58 కోట్లతో బల్దియా బడ్జెట్  – ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు

Warangal Bureau
1 Min Read

రూ.1040.58 కోట్లతో బల్దియా బడ్జెట్

– ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు

వరంగల్, మార్చి25 (ప్రజాజ్యోతి):

వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2026-2027 సం.రానికి రూ.1040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలక వర్గం ఆమోదించింది. బల్దియా అకౌంట్స్ అధికారి శివ లింగం బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటి సభ్యులు అంగీకారం తెలపడంతో పాలక వర్గం బడ్జెట్ ను ఆమోదించింది. రూ.1040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో రూ.349 కోట్ల 19 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.685 కోట్ల 20 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 620 కోట్లు డీపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. సమావేశంలో హన్మకొండ జిల్లా కలెక్టర్, జిడబ్ల్యూఎంసి ఇంచార్జి కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, డెప్యుటీ మేయర్ రిజ్వాన శమిమ్ మసూద్, కార్పొరేటర్లు, బల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *