- చిన్నచింతకుంట గ్రామంలో విషాదం
నర్సాపూర్(ప్రజాజ్యోతి) అనారోగ్య సమస్యతో మనస్థాపం చెందిన ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని చిన్న చింతకుంట గ్రామానికి చెందిన (17) దీపిక మూర్చరోగంతో బాధపడుతుండేది. దీనికి తోడు కొన్నేళ్ల క్రితం పక్షవాతం రావడంతో దీపిక ఎడమ చేయి, కాలు పడిపోయాయి. వరుసగా అనారోగ్యం సమస్యలు ఆమె కొద్ది రోజులుగా మానసిక వేదన గురైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చున్నీతో పంకాకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
