వెల్దుర్తి:పోలింగ్ కేంద్రాల పరిశీలనలో అడిషనల్ ఎస్పీ మహేందర్, తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు బుధవారం ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మహేందర్‌తో పాటు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేయడంతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజలు కూడా పోలీస్, ఎన్నికల అధికారులకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి తోడ్పడ్డారని అధికారులు పేర్కొన్నారు.
