ప్రచారంలో దూసుకుపోతున్న దోకి లచ్చయ్య
— కత్తెర గుర్తుకే ఓటేయండి
రామారెడ్డి డిసెంబర్ 05 (ప్రజా జ్యోతి)
మండల కేంద్రంలోని ఇస్సన్నపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో, కత్తెర గుర్తు సర్పంచ్ అభ్యర్థి డోకి లచ్చయ్య ప్రచారంలో దూసుకుపోతున్న తరుణం.గ్రామస్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇంటింటికీ తిరుగుతూ, తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాను అన్నారు. గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని, గతంలో పెండింగ్‌లో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తానని హమీ ఇస్తున్నారు. మాటతీరు, ప్రజలతో మమేకమయ్యే తీరు యువతతో పాటు భారీ ఎత్తున మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో, ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అధిక మెజార్టీతో ఎన్నికయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
