- స్థానిక సర్పంచ్ ఎన్నికల పై బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం
పర్వతగిరి, నవంబర్ 25 (ప్రజాజ్యోతి):
మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రం తోపాటు కల్లెడ అనంతరం , కొంకపాక, గోరుగుట్ట తండా గ్రామాల సర్పంచ్ ఎన్నికల ఇన్చార్జిలతో సన్నాహక సమావేశం ఏర్పాటుచేసి కార్యకర్తలకు ముఖ్య సూచనలు, సలహాలు చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆశావాహుల పేర్లను సేకరించడం జరిగింది. ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ రానున్న సర్పంచ్ ఎన్నికలలో పర్వతగిరి మండలం గడ్డమీద గులాబీ జండా ఎగరవేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సూచించిన అభ్యర్థికి టికెట్ కేటాయింపు ఉంటుందని అన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావునాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఇన్చార్జులు బోయినపల్లి యుగంధర్ రావు,చిన్నపాక శ్రీనివాస్, మాడుగుల రాజు, ఎస్ కె షబ్బీర్, కరిమిల మోహన్ రావు, మాజీ సర్పంచులు తౌటి దేవేందర్, భానోత్ వెంకన్న, వర్కాల రమేష్, రాజు, బోట్ల కిష్టయ్య గ్రామ శాఖ అధ్యక్షులు రతన్, మెరుగు వెంకన్న, ఎండి ముస్తఫా, సోషల్ మీడియా నాయకులు బోట్ల భాస్కర్, చిన్నపెల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
