- భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు, క్షేత్ర స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
 - ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్
 
పర్వతగిరి, అక్టోబర్ 29 (ప్రజాజ్యోతి)::
వాతావరణ శాఖ జిల్లా కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో… క్షేత్ర స్థాయి లో అధికారులు అప్రమత్తం గా ఉంటూ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పర్వతగిరి ఎంపీడీవో శంకర్ నాయక్ ఆదేశించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు స్పెషల్ ఆఫీసర్లతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి అన్ని గ్రామాల్లో పరిస్థితులను సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహణకు పలు సూచనలు చేశారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అన్ని గ్రామాల్లో JCB లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. తుఫాను ప్రభావంతో మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నందున గ్రామస్తులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించగలరని కోరారు.
					