వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 26 (ప్రజాజ్యోతి):
హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ ఆవరణంలో వరంగల్ -ఖమ్మం- నల్గోండ టీచర్స్ ఎమ్మెల్సీ, మరియు మెదక్ -నిజామాబాద్ ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలిస్తూ, సిబ్బందికి తగు సూచనలు చేశారు .అనంతరం కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, పిఓ లు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్స్ ఎన్నికలను సక్రమంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ బాక్స్ లను జాగ్రత్తగా సీల్ చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే జోనల్ అధికారిని సంప్రదించవలసిందిగా తెలియజేశారు. అనంతరం పోలింగ్ సిబ్బంది సామాగ్రిని తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి బస్సులలో నాలుగు రూట్లలో రూట్ ప్రకారంగా బయలుదేరారు. హనుమకొండ జిల్లా టీచర్స్ నియోజకవర్గంలో 5215 ఓటర్లు ఉన్నట్టు అలాగే మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో జిల్లాకు సంబంధించి166 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ -కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో 4585 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 24 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్, పరకాల ఆర్డిఓ డాక్టర్ కే.నారాయణ, తాహసిల్దార్లు పాల్గోన్నారు.