పర్వతగిరి, ఆగస్టు 19 (ప్రజాజ్యోతి)
వరంగల్ జిల్లా పర్వతగిరి సొసైటీలో యూరియా కోసం రైతులు బారులుతీరి ఘర్షణ పడుతున్నారు. సొసైటీలోకి వచ్చిన యూరియా బస్తాలను రైతులకు అందించడానికి అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. ఒక్కసారిగా రైతులు భారీగా తరలి రావడంతో ఉద్రిక్తత మొదలైంది. యూరియా బస్తాలు తక్కువగా ఉండి రైతులు ఎక్కువమంది రావడంతో మాకు అందుతాయో లేదో అని ఆందోళన రైతులలో మొదలైంది. అధికారుల నుండి టోకెన్లు రైతులు లాక్కోవడంతో తోపులాట మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను అదుపు చేస్తున్నారు.

