–
-నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతోనే రేషన్ కార్డు పంపిణీ
-ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి జూలై 18 (ప్రజా జ్యోతి )
పదేళ్ల తర్వాత తెలంగాణలో నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు పండగ వాతావరణం కల్పించారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని గత పదేండ్ల ఈ ఒక్క లబ్ధిదారునికి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరీక్షణ చేశారని ఆరోపించారు. రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు దూరమయ్యారన్నారు. రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు. రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని రాజు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేకపోయారన్నారు. ఎల్లారెడ్డి డివిజన్ లో కొత్తగా 2616 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని అన్నారు. ప్రజా సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత అని కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు పట్టించుకోవడం లేదని. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎవరు కూడా అపోహాలు చెందకూడదని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అనవసరమైన మాటలు నమ్మి తప్పుదోహ పట్టద్దన్నారు. ఈ నియోజకవర్గంలో నేను ప్రతి గడపగడపకు తిరిగానని నీరు పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు నమ్మి న్నను ఎమ్మెల్యే స్థానానికి అవకాశం ఇచ్చిన ప్రతి నిరుపేద కుటుంబానికి రుణపడి ఉంటాను అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక, మొరం అనేక సమస్యలు వస్తున్నాయని, ఈ విషయాన్ని సభ ద్వారా అధికారులు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు కూడా ఇబ్బందులు పెట్టకూడదని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అర్డీఓ పార్థసింహారెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలంలో మొత్తం 1217 మంది దరఖాస్తులు చేసుకున్నారని అందులో మొదటి ప్రాధాన్యత 645 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని మిగిలిన 572 దరఖాస్తులు పరిశీలిస్తున్నామన్నారు. లింగంపేట్ మండలంలో మొత్తం1574 మందికి 728 నూతన రేషన్ కార్డులు, మిగిలిన 846 దరఖాస్తులు, గాంధారి మండలంలో మొత్తం 2114 దరఖాస్తులు చేసుకోగా 1165 మందికి నూతన రేషన్ కార్డులు, మిగిలిన 989 మంది దరఖాస్తులు, నాగిరెడ్డిపేట్ మండలంలో మొత్తం 742 మంది దరఖాస్తులు చేసుకోగా 78 మందికి నూతన రేషన్ కార్డులు, మిగిలిన 664 మంది దరఖాస్తులను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున్, ఎల్లారెడ్డి అర్డీఓ పార్థసింహరెడ్డి, ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్, నాగిరెడ్డిపేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు, గాంధారి తహసీల్దార్ రేణుక చౌహన్, లింగంపేట్ తహసీల్దార్ సురేష్, ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, గాంధారి వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ బండారి పరమేష్, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, నాగిరెడ్డిపేట, లింగంపేట్ గాంధారి మండలాల అధ్యక్షులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.