5యూనిట్ల నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి
టౌన్ షిప్ ,అంతర్గత రోడ్లను వేగవంతంగా పూర్తి చేయాలి
-ఇందనశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్
మిర్యాలగూడ, జులై 11,(ప్రజాజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దామరచర్ల మండలంవీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను వచ్చే జనవరి నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు.శుక్రవారం అయన రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ ఎస్.హరీష్ తో కలిసి వై టి పి ఎస్ ను సందర్శించారు. ప్లాంట్ లోని విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ల ను,పవర్ స్టేషన్ కు బొగ్గు సరఫరా చేసే మార్షలింగ్ యార్డును, కూలింగ్ టవర్లు స్విచ్ యార్డ్ లను పరిశీలిం చారు.ఈ సందర్భంగా వనమ హోత్సవం కింద పవర్ ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వై టి పి ఎస్ సమా వేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు,బిహెచ్ఇఎల్ ,జెన్కో అధికారులతో సమీక్షసమా వేశం నిర్వహించారు.సిఇరమేష్ బాబు వైటిపిఎస్ ప్రస్తుత పరిస్థి తిపై పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీఎండీలకు వివరిస్తూ 2015 జూన్ లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అక్టోబర్ 2017 లో ప్రారంభంఅయ్యాయన్నారు.సవరించిన అంచనాల ప్రకారం 36,131.99 కోట్ల రూపాయల అంచనా వ్యయంతోచేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ యూనిట్లలో ప్రస్తుత పరిస్థితిని ఆయన తెలియ జేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ జనవరి నుండి విద్యుత్ కు ఏర్పడే డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అనుకు న్న సమయానికంటే ఒక నెల ముందుగానే 5 యూనిట్ల పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు.రబీ సీజన్ తో పాటు, వేసవి ప్రారంభమవుతున్న దృష్ట్యా వై టి పి ఎస్ అధికారులు, అలాగే బీహెచ్ఈఎల్ ఇంజనీరింగ్ అధికారులు వీటన్నింటిని పరిగణనలో తీసుకొని పనులు వేగవంతంగా చేసి అనుకున్న సమయానికంటే ముందే విద్యుత్ ఉత్పత్తి సాధించాలని కోరారు. ప్రత్యేకించిపర్యావరణ పరిరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని , టౌన్షిప్ పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకో వాలని,సివిల్ పనులఫై ప్రత్యేక దృష్టిని నిలపాలని ,ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలన్నారు.తక్కువ ధరకు బొగ్గును తీసుకునే విధంగా అధికారులు మార్గాలుఅన్వేషిం చాలన్నారు. థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో ఎక్కువ మొక్క లు నాటాల్సిన అవసరం ఉంద న్నారు. జెన్కో సిఎండి డాక్టర్ ఎస్. హరీష్ మాట్లాడుతూ వై టి పి ఎస్ కు వచ్చే రోడ్లు, అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలని ,ఆర్ అండ్ బి శాఖ ద్వారానిర్మిస్తున్న రహదారి కి భూసేకరణను సాధ్యమైనంతత్వరగాపూర్తిచేయాలని, ప్రాజెక్ట్ ఆవరణలో ఉన్న స్క్రాప్ ను తొలగించాల న్నారు, నిర్మాణ సంస్థ బిహెచ్ ఇఎల్ అదనపు సిబ్బందిని నియమించి అయినా 5 యూనిట్లను నిర్దేశించిన సమ యం కంటే ముందే పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకోవాల న్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైల్వే పనులు చేపట్టాలని, 2047 విజన్ ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నా య బొగ్గు మెకానిజాన్ని రూపొందించాలనిసూచించారు. బీహెచ్ఈఎల్ పవర్ డైరెక్టర్ తీజేందర్ గుప్త మాట్లాడుతూ ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, వైటీపీఎస్ కోల్ డైరెక్టర్ నాగయ్య, సివిల్ డైరెక్టర్ అజయ్ ,థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థర్మల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మయ్య, సివిల్ సీఈ శ్రీనివాసరావు,బీ హెచ్ఈఎల్ సిఇ సురేష్,ఈడి వినోద్ జాకబ్,తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు .