ఆత్మకూర్ (ఎస్),జులై 05(ప్రజాజ్యోతి):జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూరు (ఎస్) లో పూర్వ విద్యార్థులు 1982 నుండి 1988 వరకు చదువుకున్న విద్యార్థులు నెమ్మికల్ ఎవిజి ఫంక్షన్ హాల్ నందు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన శర్మ,చిలుమల రామిరెడ్డి,మహంకాళి కృష్ణమూర్తి,గిలకత్తుల జానయ్య లను ఘనంగా సన్మానించుకున్నారు.ఈ సందర్భంగా 37 సంవత్సరాల తర్వాత కలుసుకున్నటువంటి మిత్రులు ఉద్వేగ భరిత వాతావరణంలో వారి యొక్క పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూరు (ఎస్) పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.