హనుమకొండకు కొత్త ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌!

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణకు మరో రెండు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు రానున్నాయి. ఈ మేరకు సర్కార్ చర్యలు చేపడుతోంది. బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ఉన్న సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా తెలంగాణలో మరో రెండు కొత్త ప్రాంగణాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో ఒక దాన్ని హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకు అవసరమైన కసరత్తులు కూడా ప్రారంభమైనాయి. ఈ మేరకు నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉన్న బాసర ఆర్‌జీయూకేటీ ఇన్‌ఛార్జి వీసీ గోవర్ధన్, జేఎన్‌టీయూహెచ్‌ మాజీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ రెవెన్యూ అధికారులతో కలిసి ఇటీవల బేఠీ అయ్యారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలోని 60ప్రస్తుతం బాసర ఆర్‌జీయూకేటీలో ఏటా 1500 మంది విద్యార్ధులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుతో 9 వేల మందికి పైగా విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. విద్యార్ధుల సంఖ్య భారీగా ఉండటంతో క్యాంపస్ క్కిరిసిపోతోంది. దీనికితోడు ఇక్కడ కేవలం బీటెక్‌ మాత్రమే ఉంది. అదీ కూడా సంప్రదాయ ఇంజినీరింగ్‌ కోర్సులే. దీంతో బాసర ట్రిపుల్‌ ఐటీలో సరికొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. బీటెక్‌ బయోటెక్నాలజీ, బయో మెడికల్, బయో ఇన్‌ఫర్‌మేటిక్స్, ఫార్మా టెక్నాలజీ లాంటి ఇంజినీరింగ్, బయో సైన్స్‌ రెండింటి సమ్మేళనంతో మల్టీ డిసిప్లెనరీ కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న రెండు ఆర్‌జీయూకేటీ ప్రాంగణాలకు సంబంధించిన ప్రతిపాదనల్లో ఒక్కో ప్రాంగణానికి కనీసం రూ.500 కోట్ల నిధులు కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్‌జీయూకేటీల అభివృద్ధికి రూ.35 కోట్లు ప్రతిపాదించింది. ఈ నిధులు సరిపోవని అధికారులు అంటున్నారు. దీంతో 2025-26 కొత్త విద్యా సంవత్సరం ప్రాంరంభంనాటికి కొత్త ట్రిపుల్ ఐటీలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వీలైతే ఆ తర్వాత అకడమిక్‌ ఇయర్‌కు పూర్తి చేసే అవకాశం ఉంది. ఎకరాల స్థలాన్ని ఇందుకు పరిశీలిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *