దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇన్వెస్టర్ల్ సెంటిమెంట్ బలపడింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 740 పాయింట్లు లాభపడి 73,730కి పెరిగింది. నిఫ్టీ 254 పాయింట్లు పుంజుకుని 22,337 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.96గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (5.02%), టాటా స్టీల్ (7.92%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.27%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.27%), ఎన్టీపీసీ (4.06%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-3.25%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.64%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.25%), జొమాటో (-0.31%), మారుతి (-0.02%).